భగవంత్ కేసరి: మాస్ బీట్ తో అదరగొట్టిన “గణేష్ అంతెం”

Published on Sep 1, 2023 7:00 pm IST


టాలీవుడ్ స్టార్ హీరో, నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం లో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ భగవంత్ కేసరి చిత్రం మ్యూజికల్ ప్రమోషన్లు ప్రారంభమయ్యాయి. ఈ చిత్రంలోని మొదటి సింగిల్ గణేష్ ఆంతెం ను మేకర్స్ రిలీజ్ చేయడం జరిగింది. ఇది గణేష్ గొప్పతనాన్ని చాటిచెప్పే పూర్తిస్థాయి డ్యాన్స్ నంబర్.

కాసర్ల శ్యామ్ రాసిన ఈ పాటను కరీముల్లా, మనీషా పాండ్రంకి ఆలపించారు. లిరికల్ వీడియోలో నందమూరి బాలకృష్ణ ఎనర్జీ అద్భుతంగా ఉంది, శ్రీలీలతో చేసిన డ్యాన్స్ బాగున్నాయి. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించిన ఈ పాటకు థమన్ అద్భుతమైన బీట్స్ ఇచ్చాడు. మరి ఈ పాటను ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.

ప్రముఖ నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత అర్జున్ రాంపాల్ ఈ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. భగవంత్ కేసరి అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.

పాట కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :