నాని ‘గ్యాంగ్ లీడర్’ ఓవర్సీస్ డీల్ క్లోజ్ !

Published on Feb 26, 2019 9:30 am IST

జెర్సీ తరువాత న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం గ్యాంగ్ లీడర్. ‘మనం’ ఫేమ్ విక్రమ్ కుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ఆర్ఎక్స్ 100 హీరో కార్తికేయ నెగిటివ్ రోల్ లో నటిస్తున్నాడు. ఇక ఇటీవలే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కాగా అప్పుడే ఓవర్సీస్ బిజినెస్ కంప్లీట్ ఆయ్యింది. ఈ హక్కులను సరిగమ సినిమాస్ 5కోట్ల వెచ్చించి సొంతం చేసుకుంది అని టాక్. నాని గత చిత్రాలు యూస్ ఎస్ బాక్సాఫీస్ వద్ద ప్రభావం చూపలేకపోయిన ఈ కొత్త చిత్రం ఈ రేంజ్ లో బిజినెస్ చేయడం ప్రస్తుతం ట్రేడ్ సర్కిల్లో హాట్ టాపిక్ అవుతుంది.

భారీ బడ్జెట్ తో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా నటిస్తుండగా అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు . ఈ చిత్రం ఆగష్టు లో విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :