“గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” ప్రమోషన్స్ షురూ!

“గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” ప్రమోషన్స్ షురూ!

Published on May 16, 2024 8:00 PM IST

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ యొక్క కమర్షియల్ ఎంటర్టైనర్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఎట్టకేలకు మే 31న థియేటర్ల లోకి రానుంది. పెండింగ్ పనుల కారణంగా ఈ చిత్రం చాలాసార్లు వాయిదా పడింది. విశ్వక్ సేన్, ఫహద్ ఫాసిల్ యొక్క ఆవేశంలోని ఐకానిక్ సన్నివేశాన్ని రీ క్రియేట్ చేశాడు. తన చిత్రం ఇక వాయిదా పడదు అని, మే 31 కి థియేటర్ల లోకి వస్తుంది అంటూ చెప్పుకొచ్చారు.

ఈ సన్నివేశంలో, ఫహద్ ఫాసిల్ ఒక ఇన్‌స్టా రీల్‌ కోసం ఒక స్తంభం వెనుక నిలబడి, తన విభిన్న మనోభావాలను ప్రదర్శిస్తాడు. విదేశీ క్రికెటర్లతో సహా పలువురు ప్రముఖులు ఈ ట్రెండింగ్ సన్నివేశాన్ని రీ క్రియేట్ చేసారు. ఇప్పుడు విశ్వక్ సేన్ వంతు వచ్చింది. సరే, ఇది నిస్సందేహంగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడానికి మంచి మార్గం. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రానికి కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్నారు. నేహా శెట్టి, అంజలి కథానాయికలు గా నటిస్తుండగా, నాజర్, సాయి కుమార్, గోపరాజు రమణ, హైపర్ ఆది కీలక పాత్రలు పోషించారు. హిందీ బిగ్ బాస్ సెన్సేషన్ అయేషా ఖాన్ ఓ ప్రత్యేక పాటలో కనిపించనుంది. నాగ వంశీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా స్వరాలు సమకూర్చారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు