ట్రైలర్ తో ఆకట్టుకున్న “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి”

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటించిన చిత్రం “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి”. తాజాగా ఈ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలో విశ్వక్ సేన్ పాత్ర హై వోల్టేజ్ వైబ్రేషన్స్ కలిగించేలా ఉంది. సాధారణ యువకుడు, పవర్ఫుల్ పొలిటికల్ లీడర్స్‌ ని ఎదిరించి, చిన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదిగిన కోణంలో ఈ కథ సాగబోతుందని ఈ ట్రైలర్ ను చూస్తే తెలుస్తోంది. అన్నట్టు విశ్వక్ పాత్రలో కాస్త నెగెటివ్ షేడ్స్ కూడా ఉండబోతున్నట్లు అర్ధం అవుతుంది. మొత్తానికి విశ్వక్ లంకల రత్నగా ఊర మాస్ అవతార్‌లో అదరగొట్టాడు.

కాగా ఈ సినిమాను మే 31న వరల్డ్ వైడ్ గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ చిత్రంలో నేహా శెట్టి (Neha Shetty) హీరోయిన్ గా నటించగా రీసెంట్ సెన్సేషన్ అయేషా ఖాన్ (Ayeshaa Khan) స్పెషల్ సాంగ్ చేసింది. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. అలాగే సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version