ఇంట్రెస్టింగ్ గా గ్యాంగ్ స్టర్ గంగరాజు” ట్రైలర్!

Published on Jun 12, 2022 11:41 pm IST


లక్ష్ చదలవాడ హీరోగా ఈశాన్ సూర్య దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం గ్యాంగ్ స్టర్ గంగరాజు. శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిల్మ్స్ బ్యానర్ పై చదలవాడ పద్మావతి నిర్మించిన ఈ చిత్రానికి సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం కి సంబంధించిన ప్రచార చిత్రాలు, వీడియో లు విడుదలై ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్రం కి సంబంధించిన ట్రైలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేయడం జరిగింది. ఈ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది.

ఈ చిత్రం ట్రైలర్ విడుదల అయిన కొద్ది సేపటికే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ట్రైలర్ లోని హీరో నటన కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రం లో వెన్నెల కిషోర్, చరణ్ డీప్, శ్రీకాంత్ అయ్యంగార్, గోపరాజు రమణ, రాజేశ్వరి నాయర్, సత్య కృష్ణన్, రవితేజ నన్నిమల, సమ్మెట గాంధీ, అన్నపూర్ణ, నిహర్ కపూర్, రాజేంద్ర, అను మానస, లావణ్య రెడ్డి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :