షూట్ కంప్లీట్ చేసుకున్న “గ్యాంగ్‌స్టర్ గంగరాజు”..!

Published on Nov 3, 2021 2:38 am IST

విభిన్నమైన సినిమాలను ఎంచుకుంటూ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో ల‌క్ష్ చ‌ద‌ల‌వాడ ‘గ్యాంగ్‌స్ట‌ర్ గంగ‌రాజు’ లాంటి మరో వైవిధ్య భరితమైన సినిమాతో ప్రేక్షకులను మెప్పించేందుకు రెడీ అయ్యాడు. మంచి అభిరుచి గల దర్శకుడు ఇషాన్ సూర్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ పతాకంపై చదలవాడ బ్రదర్స్ సమర్పణలో పద్మావతి చదలవాడ నిర్మిస్తున్నారు.

అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్‌ని పూర్తి చేసుకున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు కూడా తెలిపారు. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

సంబంధిత సమాచారం :