విభిన్నమైన సినిమాలను ఎంచుకుంటూ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో లక్ష్ చదలవాడ ‘గ్యాంగ్‌స్టర్ గంగరాజు’ లాంటి మరో వైవిధ్య భరితమైన సినిమాతో ప్రేక్షకులను మెప్పించేందుకు రెడీ అయ్యాడు. మంచి అభిరుచి గల దర్శకుడు ఇషాన్ సూర్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ పతాకంపై చదలవాడ బ్రదర్స్ సమర్పణలో పద్మావతి చదలవాడ నిర్మిస్తున్న ఈ చిత్రం జూన్ 24న తెలుగు మరియు తమిళ భాషల్లో విడుదల కాబోతుంది.
ఈ సినిమాపై చిత్ర బృందం చాలా కాన్ఫిడెంట్‌గా ఉండటంతో ప్రమోషన్స్‌ని కూడా జోరుగా చేస్తుంది. నిజానికి ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఆ రెస్పాన్స్తోనే ప్రేక్షకులను ఆకర్షించేందుకు చిత్ర బృందం తాజాగా స్నీక్ పీక్ వీడియోను విడుదల చేశారు.
అయితే 4:20 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియో సినిమాకి బ్యాక్‌స్టోరీ. మాజీ ఎమ్మెల్యే అయిన శ్రీకాంత్ అయ్యంజర్, గంగరాజుపై ప్రతీకారం తీర్చుకోవడానికి బీహారీ గ్యాంగ్‌స్టర్ బచ్చన్ ఠాకూర్‌ను నియమించుకుంటాడు. కానీ అతడి పతనానికి గంగరాజు కారణం అయినట్టు తెలుస్తుంది.
ఈ వీడియో కొత్త గ్యాంగ్‌స్టర్ గంగరాజు గురుంచి తెలియజేస్తుంది. లక్ష టైటిల్ రోల్లో మెప్పించాడు. సినిమా విడుదలకు ముందు ఈ వీడియో మరింత అంచనాలను పెంచేసిందని చెప్పాలి. ఇదిలా ఉంటే ఈ సినిమాలో వేదికా దత్ కథానాయికగా నటిస్తుండగా, చరణ్ దీప్ విలన్‌గా కనిపించనున్నాడు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి