
సాయి కుమార్ నట వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన యంగ్ హీరో ఆది నటిస్తున్న ఏడో సినిమా ‘గరం’. ‘హార్ట్ ఎటాక్’ ఫేం అదా శర్మ హీరోయిన్ గా నటిస్తుంది. మదన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సోమవారం నుండి హైదరాబాద్ లో మొదలైంది. ఔట్ డోర్ లో షూటింగ్ చేస్తున్నారు. హీరో హీరోయిన్లపై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. అదా శర్మ ముస్లిం యువతీ పాత్ర పోషిస్తుందని సమాచారం.
యువతను ఆకట్టుకునే కథతో సినిమా తెరకెక్కిస్తున్నాం. జెంట్ జనరేషన్ & యూత్ ను రిప్రజెంట్ చేసే రోల్ లో ఆది నటిస్తున్నాడు. అని దర్శకుడు తెలిపారు. ప్రతి హీరో కెరీర్ లో ఏదో సినిమా పెద్ద హిట్ గా నిలిచింది. మా ‘గరం’ సినిమా కూడా తప్పకుండా పెద్ద విజయం సాదిస్తుంది అని నిర్మాత యం.రాజ్ కుమార్ వ్యాఖ్యానించారు.