సరిపోదా శనివారం: రేపు ఇతర బాషల్లో రిలీజ్ కానున్న గరం గరం సాంగ్!

సరిపోదా శనివారం: రేపు ఇతర బాషల్లో రిలీజ్ కానున్న గరం గరం సాంగ్!

Published on Jul 1, 2024 9:01 PM IST

నేచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో, డైరెక్టర్ వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ సరిపోదా శనివారం. వీరి కాంబినేషన్ లో ఇప్పటికే రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ అంటే సుందరానికి చిత్రం వచ్చింది. ఈ చిత్రం ప్రేక్షకులను, అభిమానులని విశేషంగా ఆకట్టుకుంది. వారి రెండవ చిత్రం సరిపోదా శనివారం పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ చిత్రం నుండి రిలీజైన ప్రచార చిత్రాలకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం నుండి ఫస్ట్ సింగిల్ గరం గరం ను మేకర్స్ తెలుగులో రిలీజ్ చేయడం జరిగింది. ఈ సాంగ్ కి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఇప్పుడు ఇతర భాషలైన తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా రిలీజ్ కి రెడీ అయిపోయింది. రేపు ఉదయం 11:07 గంటలకు పూర్తి సాంగ్ రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో ప్రియాంక మోహన్‌ కథానాయికగా నటిస్తుండగా, ఎస్‌జే సూర్య, సాయికుమార్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జేక్స్ బిజోయ్ స్వరాలు సమకూరుస్తున్నారు. సరిపోదా శనివారం చిత్రం ఆగస్ట్ 29, 2024న భారతీయ ప్రధాన భాషల్లో రిలీజ్ కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు