సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న సాయి పల్లవి ‘గార్గి’ … !

Published on Jul 14, 2022 12:00 am IST

యువ నటి సాయిపల్లవి ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ గార్గి. ఇటీవల వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన విరాట పర్వం మూవీలో వెన్నెల క్యారెక్టర్ తో అందరినీ ఆకట్టుకున్న సాయి పల్లవి, మరొక్కసారి నటనకు ప్రాధాన్యం ఉన్న గార్గి మూవీని ఎంచుకున్నారు. రవిచంద్రన్ రామచంద్రన్, ఐశ్వర్య లక్ష్మి, థామస్ జార్జి కలిసి ఎంతో గ్రాండ్ గా నిర్మించిన ఈ మూవీని తమిళ్ లో సూర్య, జ్యోతిక కలిసి రిలీజ్ చేస్తుండగా తెలుగులో రానా దగ్గుబాటి సమర్పణలో సురేష్ ప్రొడక్షన్స్ వారు విడుదల చేస్తున్నారు.

ఈ మూవీ తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో ఈనెల 15న రిలీజ్ కానుంది. కాగా ఈ మూవీ యొక్క సెన్సార్ కార్యక్రమాలు నేడు పూర్తి అవ్వగా, మూవీకి యు/ఏ సర్టిఫికెట్ ఇచ్చారు సెన్సార్ సభ్యులు. ఎమోషనల్ యాక్షన్ డ్రామా మూవీగా మహిళా ప్రాధాన్యత కలిగిన మూవీగా తెరకెక్కిన గార్గి లో హీరోయిన్ సాయి పల్లవి యాక్టింగ్, ఎమోషనల్ సీన్స్ మెయిన్ హైలైట్ అంటున్నారు దర్శకుడు గౌతమ్ రామచంద్రన్. టీచర్ అయిన ఒక మహిళ, తన జీవితంలో ఎదురైన సమస్యకి సంబంధించి ఈ మూవీ కథ సాగుతుందట. మరి ఈ మూవీతో సాయి పల్లవి ఎంతమేర విజయాన్ని అందుకుంటారో చూడాలి.

సంబంధిత సమాచారం :