ఫోటో మొమెంట్ : NBK 108 మూవీ సెట్ లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్

ఫోటో మొమెంట్ : NBK 108 మూవీ సెట్ లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్

Published on Dec 31, 2022 8:24 PM IST

ప్రస్తుతం గోపిచంద్ మలినేని దర్శకత్వంలో వీరసింహారెడ్డి మూవీ చేస్తున్నారు నటసింహం నందమూరి బాలకృష్ణ. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ మూవీ పై బాలకృష్ణ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరిలో భారీ స్థాయి అంచనాలు ఉన్నాయి. థమన్ సంగీతం అందించిన ఈ మూవీ సాంగ్స్ ఇప్పటికే మంచి రెస్పాన్స్ సొంతం చేసుకున్నాయి. ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

ఇక మరోవైపు తన తదుపరి NBK 108 మూవీ అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తున్నారు బాలకృష్ణ. థమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది తెరకెక్కిస్తున్నారు. మంచి యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ మూవీ కొద్దిరోజులుగా భారీ జైలు సెట్ లో ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటుండగా నేటితో దానిని పూర్తి చేసిన యూనిట్, రేపు న్యూ ఇయర్ సందర్భంగా కొద్దిసేపటి క్రితం సెట్స్ లో ప్రత్యేకంగా కేక్ కట్ చేసి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ సందర్భముగా వారి సెలబ్రేషన్స్ తాలూకు ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు