‘గరుడవేగ, నెక్స్ట్ నువ్వే’ కృష్ణా జిల్లా కలెక్షన్లు !

6th, November 2017 - 11:59:04 AM

సినిమా వసూళ్లకు కీలకమైన కృష్ణా జిల్లా ఏరియాలో తాజ్ సినిమాలు వసూళ్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ముందుగా గత వారం విడుదలైన రాజశేఖర్ ‘పిఎస్వి గరుడవేగ’ విషయానికొస్తే 3వ రోజు ఆదివారం రూ.10.3 లక్షల షేర్ ను రాబట్టిన ఈ సినిమా మొత్తంగా రూ.19.37 కోట్ల షేర్ ను ఖాతాలో వేసుకుంది. అలాగే ఆది సాయికుమార్ యొక్క ‘నెక్స్ట్ నువ్వే’ 3న రోజు రూ.4.3 లక్షలతో మొత్తంగా రూ.8.75 లక్షల షేర్ ను రాబట్టుకుంది.

ఇక రవితేజ ‘రాజా ది గ్రేట్’ ఇప్పటికి స్టడీగానే రన్ అవుతూ 19 వ రోజు రూ.3.13 లక్షలను వసూలు చేసి మొత్తంగా రూ.1.72 కోట్ల షేర్ ను నమోదు చేయగా రామ్ యొక్క ‘ఉన్నది ఒకటే జిందగీ’ 10వ రోజు రూ.7.72 లక్షలతో మొత్తంగా రూ.98.8 లక్షల షేర్ ను రాబట్టి కోటి మార్కును చేరుకునే ప్రయత్నంలో ఉంది.