‘గౌతమిపుత్ర శాతకర్ణి’ రన్‌టైమ్‌ను ఫిక్స్ చేసిన క్రిష్!
Published on Nov 28, 2016 12:33 pm IST

krish
నందమూరి నటసింహం బాలయ్య హీరోగా నటిస్తోన్న వందో సినిమా ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న విషయం తెలిసిందే. విలక్షణ దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకొని తారాస్థాయి అంచనాల మధ్యన జనవరి నెలలో సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. ఇక షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది.

ఫైనల్ ఔట్‌పుట్‌ను క్రిష్ 2 గంటల 12 నిమిషాలకు ఫిక్స్ చేశారట. క్రిష్ గత చిత్రాల్లానే ఈ చారిత్రక సినిమా కూడా తక్కువ రన్‌టైమ్‌తో ఉండనుండడం విశేషంగా చెప్పుకోవాలి. చారిత్రక నేపథ్యంలో సాగే శాతకర్ణి జీవిత కథతో రూపొందుతోన్న ఈ సినిమాను, క్రిష్, భారీ బడ్జెట్‌తో స్వయంగా నిర్మిస్తున్నారు. డిసెంబర్ 16న తిరుపతిలో నిర్వహించే ఆడియో వేడుకతో సినిమా ప్రమోషన్స్‌కు టీం శ్రీకారం చుట్టేందుకు సిద్ధమవుతోంది.

 
Like us on Facebook