‘గౌతమీపుత్ర శాతకర్ణి’ షూటింగ్ అప్డేట్స్

2nd, August 2016 - 12:17:18 PM

Gautamiputra-Satakarni
‘నందమూరి బాలకృష్ణ’ ‘క్రిష్’ దర్శకత్వంలో ఏంతో ప్రతిషాత్మకంగా చేస్తున్న తన 100వ చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’. కొద్దిరోజుల క్రితం వరకూ జార్జియా, మొరాకో వంటి ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం ప్రస్తుతం దర్శకుడు క్రిష్ పెళ్లి వేడుక కారణంగా కాస్త ఆగి ఉంది. ఆగష్టు 8న క్రిష్ పెళ్లి పూర్తవగానే తిరిగి షూటింగ్ మొదలుకానవుంది.

మొదట ఆగష్టు 20 నుండి హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుని అనంతరం సెప్టెంబర్ 1 నుండి మధ్యప్రదేశ్ లో కొనసాగుతుంది. ఈ షెడ్యూల్లోనే బాలకృష్ణపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని దర్శకుడు క్రిష్, రాజీవ్ రెడ్డిలు సంయుక్తంగా నిర్మిస్తుండగా జనవరి 12న సంక్రాంతి కానుకగా చిత్రాన్ని విడుదల చేయనున్నారు.