మైఖేల్ చిత్రం లో విలన్ పాత్ర లో ప్రముఖ దర్శకుడు!

Published on Nov 22, 2021 12:41 pm IST

సందీప్ కిషన్ హీరోగా రంజిత్ జేయకోడి దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం మైఖేల్. పాన్ ఇండియా చిత్రం గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ను వివిధ బాషల్లో నిర్మిస్తున్నారు. శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి మరియు కరణ్ సి ప్రొడక్షన్స్ ఎల్ ఎల్ పి పతాకాల పై ఈ చిత్రాన్ని భరత్ చౌదరీ మరియు పుస్కుర్ రామ్ మోహన్ రావు లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

అయితే తాజాగా ఈ చిత్రం లోకి ఒక విలక్షణ నటుడు, దర్శకుడు జాయిన్ అయ్యారు. ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఈ చిత్రం లో విలన్ పాత్ర లో నటిస్తున్నారు. ఇందుకు సంబంధించిన అప్డేట్ ను చిత్ర యూనిట్ నేడు ఒక పోస్టర్ ద్వారా వెల్లడించడం జరిగింది. ఈ చిత్రం లో సందీప్ కిషన్, గౌతమ్ మీనన్ లతో పాటుగా, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More