వాలెంటైన్స్ డేని టార్గెట్ చేసిన గౌతమ్ మీనన్!
Published on Nov 28, 2016 8:26 am IST

dhanush-new-movie
దర్శకుడు గౌతమ్ మీనన్, హీరో ధనుష్‌ల క్రేజీ కాంబినేషన్‌లో ‘ఎనై నొక్కి పాయుమ్ తోట్ట’ (బుల్లెట్ నావైపు దూసుకొస్తోంది అని అర్థం) అనే ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. గౌతమ్ మీనన్ స్టైల్లో యాక్షన్, రొమాన్స్ జానర్లో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ చివరిదశకు చేరుకుంది. ఇక తాజాగా నిన్న సాయంత్రం సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. రెండు డిఫరెంట్ షేడ్స్‌లో ఉన్న ధనుష్‌ను ఈ పోస్టర్స్‌లో చూడొచ్చు.

గౌతమ్ మీనన్ మార్క్ ఫస్ట్‌లుక్‌లోనే స్పష్టమైపోవడంతో అభిమానుల వద్ద నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఇక ఈ సినిమాను ఫిబ్రవరి నెలలో వాలెంటైన్స్ వారంలో విడుదల చేయనున్నట్లు గౌతమ్ మీనన్ తెలిపారు. రానా ఈ సినిమాలో ఓ చిన్న గెస్ట్ రోల్ చేస్తూన్నారు. మేఘా ఆకాష్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

 
Like us on Facebook