అమెరికా నేపథ్యంలో గౌతమ్ మీనన్ కొత్త సినిమా!
Published on Nov 27, 2016 10:46 am IST

gautham-meonan
దర్శకుడు గౌతమ్ మీనన్‌ది ఒక ప్రత్యేకమైన శైలి. తెలిసిన కథలనే చాలా తెలివిగా, తనదైన కోణంలో చెప్తాడన్న గొప్ప పేరుందాయనకు. తాజాగా ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన ‘సాహసం శ్వాసగా సాగిపో’ ఈ నెల్లోనే విడుదలై తెలుగు, తమిళ భాషల్లో మంచి రెస్పాన్స్‌నే తెచ్చుకుంది. ఇక ఈ సినిమా విడుదలవ్వడానికి ముందే ధనుష్‌తో ఓ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్ళి దాదాపుగా షూటింగ్ పూర్తి చేసిన గౌతమ్, అప్పుడే మరో కొత్త సినిమాకు కూడా రంగం సిద్ధం చేసుకున్నారు. ఆయన దర్శకత్వంలో విక్రమ్ హీరోగా తెరకెక్కే సినిమా నేడు అఫీషియల్‌గా అనౌన్స్ అయింది.

విక్రమ్ – గౌతమ్ మీనన్ కాంబినేషన్‌పై చాలారోజులుగా వార్తలు వినిపిస్తున్నా ఇప్పటికి అది కన్‌ఫర్మ్ అయింది. మార్చి నెలలో సెట్స్‌పైకి వెళ్ళనున్న ఈ సినిమా పూర్తిగా అమెరికా నేపథ్యంలో నడుస్తుందట. ఇక ఈ సినిమా గౌతమ్ మీనన్ స్టైల్లోనే యాక్షన్, రొమాన్స్ కాంబినేషన్‌లో తెరకెక్కనుందని తెలుస్తోంది. ప్రస్తుతం సౌతిండియన్ సెన్సేషన్ సాయి పల్లవి ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించనున్నట్లు సమాచారం.

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook