ధనుష్ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ అతడే

తమిళ్ తో పాటు తెలుగులో కూడా క్రేజ్ ఉన్న దర్శకుడు గౌతమ్ మీనన్. రొమాంటిక్ సినిమాలు బాగా తెరకెక్కిస్తాడని పేరున్న గౌతమ్ తాజాగా తమిళంలో స్టార్ హీరోల్లో ఒకరైన ధనుష్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ఎన్నే నొక్కి పాయమ్ తొట్ట అనే టైటిల్ ను ఫిక్స్ చేసారు, తెలుగు టైటిల్ ఇంకా ప్రకటించాల్సి ఉంది.

చాలా కాలం నుండి ఈ సినిమాకు మ్యూజిక్ ఎవరు చేస్తారనే సందేహం ఉండేది, ఈ రోజు యూనిట్ మ్యూజిక్ డైరెక్టర్ ను అధికారికంగా ప్రకటించారు, దుర్బుక శివ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుడడం విశేషం. ఈ చిత్రంలో ధనుష్ సరసన మేఘా ఆకాశ్ హీరోయిన్ గా నటిస్తున్న‌ది, రానా దగ్గుబాటి కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం