సెన్సార్ పూర్తిచేసుకున్న ‘గాయత్రి’ సినిమా !

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన చిత్రం ‘గాయ‌త్రి’. మదన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫిబ్రవ‌రి 9న ప్రేక్షకుల ముందుకురానుంది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా యు/ఏ సర్టిఫికెట్ పొందింది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది.

రెండు విభిన్న పాత్రల్లో మోహన్ బాబు కనిపించనున్న ఈ సినిమాలో మంచు విష్ణు మోహన్ బాబు యంగ్ ఏజ్ లో ఉన్నప్పటి పాత్రలో కనిపించబోతున్నాడు. శ్రియ, విష్ణుకు జోడిగా నటించింది. వీరిద్దరు సినిమాలో కనిపించేది కొద్దిసేపే అయినా వారి పాత్రలు సినిమాకు కీలకం కానున్నాయి. తమన్ అందించిన పాటలు బాగున్నాయి. ముఖ్యంగా ‘ఒక నువ్వు ఒక నేను’ సాంగ్ ఆకట్టుకుంది. అనసూయ ప్రధాన పాత్రలో కనిపించిన ఈ సినిమాకు డైమండ్ రత్నబాబు కథ మాటలు అందించారు.

Exit mobile version