వి.వి.వినాయక్, కోన వెంకట్ ముఖ్య అతిథులుగా ‘గేదెలరాజు’ ప్రీ రిలీజ్ ఈవెంట్

Gedela Raju Pre-Release Event

రఘు కుంచె టైటిల్‌ పాత్రలో నటించిన సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ ‘గేదెలరాజు’ సినిమా ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకులు వి.వి.వినాయక్, వి.ఎన్.ఆదిత్య, రచయిత కమ్ ప్రొడ్యూసర్ కోన వెంకట్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. నూతన దర్శకుడు చైతన్య మోటూరి తెరకెక్కించిన ఈ చిత్రాన్ని, మోటూరి టాకీస్‌ పతాకంపై వాణి రవికుమార్‌ మోటూరి నిర్మిస్తున్నారు. ఈ మూవీ ఈ నెల 24న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.

ఈ సందర్భంగా దర్శకుడు వి.వి.వినాయక్ మాట్లాడుతూ.. సింగర్, మ్యూజిక్ డైరెక్టర్, నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రఘుకుంచె సోలో హీరోగా చేసిన ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలని ఆకాంక్షించారు. కొత్త వారైనా సరే, కంటెంట్ బాగుంటే సినిమాలు తప్పకుండా సక్సెస్ అవుతాయని కోన వెంకట్ పేర్కొన్నారు. కుమారుడు చైతన్యపై నమ్మకంతో సినిమా నిర్మించిన తల్లిదండ్రులను వి.ఎన్.ఆదిత్య ప్రత్యేకంగా అభినందించారు.

కాకినాడ పట్టణ నేపథ్యంగా రౌడీయిజం చుట్టూ ఈ కథ తిరుగుతుందని రఘు కుంచె వెల్లడించారు. ముఖ్యంగా సినిమాలో చివరి 20 నిమిషాల ట్విస్ట్ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుందని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ లాంటి అగ్ర సంస్థ ఈ చిత్రాన్ని సుమారు వందకు పైగా స్క్రీన్లలో పంపిణీ చేస్తుండటం సినిమాపై ఉన్న అంచనాలను పెంచుతోంది.

Exit mobile version