గీతా ఆర్ట్స్ 2 బ్యానర్లో యంగ్ హీరో సినిమాకి ఇంట్రెస్టింగ్ టైటిల్.!

Published on Jan 7, 2022 11:55 am IST

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోస్ లో లేటెస్ట్ సెన్సేషన్ కిరణ్ అబ్బవరం కూడా ఒకడు. అయితే కిరణ్ హీరోగా ఆల్రెడీ రెండు వరుస హిట్స్ అనంతరం మరో ఆసక్తికర ప్రాజెక్ట్ ని కూడా కంప్లీట్ చేస్తున్నాడు. మరి దీని తర్వాత ప్రముఖ టాలీవుడ్ సక్సెస్ ఫుల్ బ్యానర్ గీతా ఆర్ట్స్ 2 తో ఓ సినిమా చేస్తున్నట్టు రీసెంట్ గానే అనౌన్స్ చెయ్యగా దానిపై మరింత ఆసక్తి మొదలైంది.

మరి మేకర్స్ ఇప్పుడు ఈ సినిమా టైటిల్ ని రివీల్ చేశారు. ఈ సినిమాకి గాను మేకర్స్ “వినరో భాగ్యము విష్ణు కథ” అనే డివోషనల్ టచ్ ఉన్న టైటిల్ ని ఫిక్స్ చేశారు. అలాగే డిజైన్ కూడా అలానే ఉంది కాబట్టి సినిమా ఎలా ఉంటుందో అనేది మరింత ఇంట్రెస్టింగ్ గా మారింది.

అలాగే ఈ టైటిల్ బ్యాక్గ్రౌండ్ లో కనిపిస్తున్న కాన్సెప్ట్ స్కెచ్ కూడా సినిమా నేపథ్యం ఎలా ఉంటుంది అనేది తెలియజేస్తుంది. అలానే హెల్పింగ్ నేచర్ అనే ట్యాగ్ లైన్ కూడా పెట్టడంతో ఈ సినిమాలో ప్రకృతికి కూడా ప్రాధాన్యం ఉంటుంది అని అర్ధం అవుతుంది. ఇక ఈ సినిమాకి కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తుండగా కశ్మీర హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నాడు.

సంబంధిత సమాచారం :