లేటెస్ట్ సెన్సేషన్ హీరోతో ‘గీతా ఆర్ట్స్ 2’ వారి ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్.!

Published on Jan 6, 2022 11:19 am IST


తెలుగు చలన చిత్ర పరిశ్రమ వద్ద ఈ బ్యానర్ లో ఓ సినిమా వస్తుంది అంటే అది దాదాపు హిట్టే అని బ్రాండ్ ఉన్న అతి తక్కువ నిర్మాణ సంస్థలలో సీనియర్ నిర్మాత అల్లు అరవింద్ బ్యానర్ గీతా ఆర్ట్స్ ఒకటి. అయితే పలు భారీ సినిమాలకు గీతా ఆర్ట్స్ అలాగే కొత్త తరం కొత్త టాలెంటడ్ ఫిల్మ్ మేకర్స్ కి అన్నట్టుగా నిర్మాత బన్నీ వాస్ లతో స్టార్ట్ చేసిన బ్యానర్ “గీతా ఆర్ట్స్ 2”.

ఇక వీరి నుంచి కూడా సక్సెస్ రేట్ సాలిడ్ గానే ఉండగా నిన్న వీరి నుంచి ఏడవ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేశారు. మరి ఇప్పుడు ఈ సినిమా ఎవరితోనో అనేది రివీల్ చేశారు. ఈ హీరో మరెవరో కాదు ప్రెజెంట్ యూత్ లో తన సినిమాలతో మంచి ముద్ర వేసుకున్న సెన్సేషన్ హీరో కిరణ్ అబ్బవరం. మరి ఈ కాంబోకి సంబంధించి టైటిల్ ని రేపు జనవరి 7న ఉదయం 10 గంటల 19 నిమిషాలకు రిలీజ్ చేస్తున్నట్టుగా కూడా ప్రకటించారు. మరి ఇతర వివరాలు కూడా మరిన్ని రేపే రానున్నాయి. చూడాలి మరి ఈ కాంబో ఎలా ఉంటుందో.

సంబంధిత సమాచారం :