గీతా ఆర్ట్స్ బ్యానర్లో విజయ్ దేవరకొండ కొత్త చిత్రం !

Vijay-Devarakonda
‘100 % లవ్, భలే భలే మగాడివోయ్’ వంటి సూపర్ హిట్ సినిమాల్ని నిర్మించిన నిర్మాత బన్నీ వాసు ‘పెళ్లి చూపులు’తో మోస్ట్ వాంటెడ్ యంగ్ హీరోగా మారిన విజయ్ దేవరకొండతో కొత్త చిత్రాన్ని కొద్దిసేపటి క్రితమే అనౌన్స్ చేశారు. ఈ చిత్రాన్ని ‘శ్రీ రస్తు శుభమస్తు’ ఫేమ్ పరశురామ్ డైరెక్ట్ చేయనున్నాడు. పూర్తి స్థాయి లవ్ స్టోరీగా ఈ చిత్రం ఉండబోతోంది.

ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సంక్రాంతి తరువాత మొదలయ్యే అవకాశముంది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై రూపుదిద్దుకోనున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. పోయిన సంవత్సరం తెలుగులో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ‘సరైనోడు, శ్రీరస్తు శుభమస్తు, ధృవ’ వంటి భారీ సక్సెస్ ఫుల్ సినిమాల్ని, కన్నడలో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై ‘సుందరంగ జాణ’ సినిమాని నిర్మించిన అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని సమర్పిస్తుండటంతో ఈ ప్రాజెక్ట్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇకపోతే విజయ్ దేవరకొండ ప్రస్తుతం ‘అర్జున్ రెడ్డి’ సినిమాలో నటిస్తుండగా ఆయన నటించిన మరో చిత్రం ‘ద్వారక’ రిలీజ్ కు సిద్ధంగా ఉంది.