ఏపీ వరద బాధితులకు గీతా ఆర్ట్స్‌ విరాళం..!

Published on Nov 24, 2021 11:10 pm IST


ఏపీలోని తిరుపతి, నెల్లూరు ప్రాంతాలను వరదలు ముంచెత్తిన సంగతి తెలిసిందే. దీంతో ఆ ప్రాంతాల ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అయితే వరద బాధితులను ఆదుకోడానికి పలువురు తమవంతు సాయం అందచేస్తున్నారు. అయితే తాజాగా టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ కూడా వరద బాధితుల కోసం ఆర్థిక సాయం అందించింది.

తిరుపతి వరద బాధితుల కోసం రూ.10 లక్షలను ఏపీ సీఎం సహాయనిధికి విరాళంగా ఇచ్చింది. ఈ విషయాన్ని గీతా ఆర్ట్స్‌ స్వయంగా ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం తమవంతు సహాయం అందించినట్టు చెప్పుకొచ్చారు.

సంబంధిత సమాచారం :