గీత గోవిందం ఇప్పటివరకు ఎంత రాబట్టిందంటే !

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ నటించిన ‘గీత గోవిందం’ ఇటీవల విడుదలై బాక్సాఫిస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఈసినిమా విడుదలై 26 రోజులవుతున్న ఇప్పటికి మంచి కలెక్షన్స్ ను సాధిస్తూ మిగితా సినిమాలపై ప్రభావం చూపిస్తుంది.

ఇక ఈ సినిమా ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.120కోట్ల గ్రాస్ ను అలాగే రూ.66.4కోట్ల షేర్ ను రాబట్టింది. ఇక ఈ చిత్రం యొక్క నైజాం వసూళ్లు స్టార్ హీరోల రికార్డులను బద్దలు కొడుతుంది. గీత గోవిందం అక్కడ రూ.19కోట్ల షేర్ ను అలాగే రూ .34కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసి 20కోట్ల క్లబ్ లోకి ఎంటర్ కానుంది.

కేవలం స్టార్ హీరోల చిత్రాల మాత్రమే ఈ ఫీట్ ను సాధించాయి. మీడియం బడ్జెట్ సినిమా గా వచ్చి ఈ తరహా కలెక్షన్స్ ను రాబట్టి నిర్మాతలకు భారీ లాభాన్ని తీసుకొచ్చింది ఈ చిత్రం. గీతా ఆర్ట్స్ 2పతాకం ఫై బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రాన్ని పరుశురాం తెరకెక్కించాడు.