‘గీత గోవిందం’కు ఎదురుదెబ్బ.. కొన్ని సన్నివేశాలు లీక్

విజయ్ దేవరకొండ, రష్మిక మండన్న జంటగా పరశురాం దర్శకత్వంలో రాబోతున్న చిత్రం ‘గీత గోవిందం’. గీతా ఆర్ట్స్-2 పతాకం ఫై బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నారు. కాగా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఆగష్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.

అయితే ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలను సోషల్‌ మీడియాలో షేర్ చేసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే గుంటూరులోని కొంతమంది స్టూడెంట్స్ గీతగోవిందం చిత్రంలోని కొన్ని సన్నివేశాలను షేర్‌ చేసుకున్నట్టుగా పోలీసులు గుర్తించారు.

ఈ చిత్రానికి పోస్ట్‌ ప్రొడక్షన్‌ చేసిన టెక్నికల్ టీంలోని ఓ వ్యక్తి ఆ సన్నివేశాలను కాపీ చేసి తన ఫ్రెండ్స్ కు పంపించటం జరిగింది. వాళ్ళు మరికొంతమందికి పంపించటం వల్ల ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆ సన్నివేశాలు షేర్ అవుతున్నాయి. పోలీసులు లీక్ చేసిన వ్యక్తులను విచారిస్తున్నారు.