యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ అంజలి మెయిన్ లీడ్ లో నటించిన చిత్రం “గీతాంజలి” చిత్రం మంచి హిట్ అయ్యిన సంగతి తెలిసిందే. హారర్ కామెడీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించిన ఈ చిత్రంపై సీక్వెల్ ని మళ్ళీ మేకర్స్ ఇన్నేళ్ల తర్వాత “గీతాంజలి మళ్ళీ వచ్చింది” గా తీసుకొస్తున్నారు. అయితే ఇంట్రెస్టింగ్ ప్రమోషన్స్ తో ఆసక్తి రేపిన మేకర్స్ ఇప్పుడు టీజర్ ని అయితే రివీల్ చేశారు.
మరి ఈ టీజర్ లో శ్రీనివాస్ రెడ్డి, సత్యం రాజేష్, కమెడియన్ సత్య సహా షకలక శంకర్ లు కూడా కనిపిస్తున్నారు. మరి అదనంగా సునీల్ తో మంచి కామెడీ అన్నీ బాగున్నాయి. అదే సినిమా బ్యాక్ డ్రాప్ లో కాస్త ఆసక్తికర నేపథ్యంలో ప్లాన్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. అలాగే వెర్సటైల్ నటుడు డబ్బింగ్ ఆర్టిస్ట్ రవి శంకర్ అయితే కనిపిస్తున్నారు. అలాగే హారర్ ఎలిమెంట్స్ కూడా మరింత ఎక్కువ రేంజ్ లో కనిపిస్తున్నాయి.
అలాగే అంజలి పాత్ర కూడా సాలిడ్ గా కనిపిస్తుండగా తనపై మంచి యాక్షన్ ఎలిమెంట్స్ అండ్ ఎమోషన్స్ కూడా కనిపిస్తున్నాయి. ఇక ఫైనల్ గా హిలేరియస్ కామెడీతో మేకర్స్ అయితే డబుల్ ఎంటర్టైన్మెంట్ ని ప్రామిస్ చేస్తున్నారు. మరి ఈ చిత్రానికి నిర్మాణం, కథ కోన వెంకట్ అందించగా శివ తుర్లపాటి దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే ప్రవీల్ లక్కరాజు స్కోర్ టీజర్ లో ఇంప్రెసివ్ గా ఉంది. ఇక ఈ చిత్రాన్ని మేకర్స్ పాన్ సౌత్ భాషల్లో ఈ మార్చ్ 22న రిలీజ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు.
టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి