‘ఆహా’లో గీతాంజలి మళ్ళీ వచ్చింది !

అంజలి ప్రధాన పాత్రలో, శ్రీనివాస్ రెడ్డి, సునీల్, సత్యం రాజేష్, సత్య కీలక పాత్రల్లో.. శివ తుర్లపాటి దర్శకత్వం లో తెరకెక్కిన హారర్ కామెడీ ఎంటర్టైనర్ గీతాంజలి మళ్ళీ వచ్చింది. ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ అనంతరం ఓటీటీ రిలీజ్ కోసం చూస్తున్న వారికి ఇప్పుడు ఆ సర్ప్రైజింగ్ అప్ డేట్ వచ్చింది. ఈ సినిమా మే 8వ తేదీ నుంచి ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు చిత్రబృందం అధికారికంగా ఓ పోస్టర్ ను కూడా రిలీజ్ చేసింది.

అన్నట్టు గీతాంజలి మళ్లీ వచ్చింది అంజలికి 50వ చిత్రం కావడం విశేషం. ఈ సినిమాలో షకలక శంకర్, సునీల్, అలీ, రవిశంకర్, రాహుల్ మాధవ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా థియేటర్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో కొంతవరకు సక్సెస్ అయ్యింది. ఐతే, ఓటీటీ ప్రేక్షకులను ఈ సినిమా ఆకట్టుకుంది అని అంచనాలు ఉన్నాయి.

Exit mobile version