డైమండ్ జూబ్లీ సందర్భంగా జెమినీ స్టూడియోస్ నుంచి సరికొత్త ప్రకటన.!

Published on Apr 12, 2021 2:00 pm IST

సాధారణంగా మన తెలుగు స్మాల్ స్క్రీన్ లో జెమినీ ఛానెల్ కోసం ప్రతీ ఒక్కరూ చూసే ఉంటారు. అయితే దాని పూర్తి చరిత్ర కోసం మాత్రం చాలా మందికి తెలియకపోవచ్చు..మరి ఆ చరిత్రను వెలికి తీస్తే.. మన భారతీయ సినీ చరిత్రలోనే ఆయన ఒక సంచలనం .. ఎల్ .వి. ప్రసాద్ గా అందరికి సుపరిచితులైన అక్కినేని లక్ష్మీ వరప్రసాద్ గారు భారతీయ చలన చిత్ర రంగం లో ఒక మహోన్నత శిఖరం..మొట్టమొదటి టాకీ చిత్రం ఆలం అరా లో ఒక నటుడి గా మొదలైన ఆయన ప్రయాణం లో అసిస్టెంట్ డైరెక్టర్ గా, సినిమాటోగ్రాఫర్ గా, డైరెక్టర్ గా , ప్రొడ్యూసర్ గా ఎన్నో భారతీయ భాషల ఆయన చేసిన ప్రతీ చిత్రం ఒక అణిముత్యమే..భారతీయ సినిరంగం లో ఆకాలం లోని నటీనటులందరూ ఆయన తో కలిసి పనిచేయడానికి తహతహలాడినవారే…

ఆయన ప్రతి అడుగు ఒక సంచలనమే .. అది సినీ రంగానికి ఒక నూతన అధ్యాయమే.. అ అధ్యాయం జెమినీ స్టూడియోస్ తో ప్రారంభం అయ్యింది..పాన్ ఇండియా లెవెల్ లో అన్ని భారతీయ భాషలలో 100 నుండి 15౦ సినిమాల వరకు ప్రొడ్యూస్ చేసిన శ్రీ వాసన్ గారు 1940 లో జెమినీ స్టూడియోస్ ని స్థాపించడం జరిగింది .. కొమ్ము బూర ఊదుతూ ఉన్న ఇద్దరు కవలలు లోగో తో జెమినీ స్టూడియోస్ అన్న పేరు తేరా మీద పడితేనే చాలు అది బ్లాక్ బస్టర్ .. జెమినీ స్టూడియోస్ అంటేనే ఇండియా లోనే కాదు ప్రపంచ చలన చిత్ర రంగం లోనే అది ఒక మార్క్ ..ఒక బ్రాండ్ .. ఒక ట్రెండ్ సెట్టర్ ..తనకు తెలిసిన ప్రతిభావంతులు ఎందరున్నా వారేవరి మీద వాసన్ గారికి కలగని నమ్మకం..ఎల్ .వి . ప్రసాద్ గారి కుటుంబం మీద కలిగింది..

కారణం ఒకటే సినిమా రంగం లో ప్రతీవిభాగం లోను వాళ్ళకున్న పట్టు.. కథ అనుకున్న దగ్గరినుండి అది ఒక సినిమా గా ప్రేక్షకులకు చేరివాళ్ళతో శేభాస్ అనిపించుకోవాలంటే ఎం చేయాలో వాళ్ళకు తెలుసు .. ఆ కుటుంబానికి తెలుసు ..ఆ నమ్మకమే వాసన్ గారిని జెమినీ స్టూడియోస్ భాద్యతను ఎల్ . వి .ప్రసాద్ గారి వారసులైన అక్కినేని మనోహర్ ప్రసాద్ గారికి , రవిశంకర్ ప్రసాద్ గారికి అప్పగించేలా చేసింది..ఏ పనిచేసినా , ఎ వ్యాపారం ప్రారంభించినా తమ ద్వారా సినిమా రంగం లో నిర్మాతలకు , టేక్నీషియన్ లకు మంచి జరగాలి..సినిమా నే నమ్ముకుని బ్రతుకుతున్న వేలాదిమంది కార్మికులకు ఉపాధి కల్పించాలి..

అన్న ప్రసాద్ బ్రదర్స్ సత్సంకల్పం వారిని ఎన్నో సంస్థల ఆవిర్భావానికి శ్రీకారం చుట్టేల చేసింది..ఆనంద్ సినీ సర్వీసెస్.. సౌత్ ఫిలిం ఇండస్ట్రీ లోనే అతిపెద్ద ఔట్డోర్ ఎక్విప్మెంట్ లీజింగ్ కంపెనీ ..జెమినీ లాబ్స్ .. జెమినీ ఎఫెక్ట్స్ [VFX ] లో కంప్లీట్ పోస్ట్ ప్రొడక్షన్ సౌకర్యాలు ..జెమినీ స్టూడియోస్ , జెమినీ ఫిలిం సర్క్యూట్ ఫిలిమ్స్ బ్యానర్ ల ద్వారా సౌత్ ఇండియన్ లో అన్ని లాంగ్వేజ్ లలో స్టార్ హీరో లతో భారీ బడ్జెట్ సినిమాలు .. బ్లాక్ బస్టర్ విజయాలు ..మెగాస్టార్ తో శంకర్ దాదా MBBS , కమల్ హసన్ తో వసూల్ రాజా MBBS.. దళపతి విజయ్ మెగా డైరెక్టర్ శంకర్ లతో నన్బన్.. మలయాళం సూపర్ స్టార్ మమ్ముట్టి తో ఉండా.. గ్రేట్ డైరెక్టర్ మణిరత్నం గారి తో కడలి .. నేచురల్ స్టార్ నాని తో స్నేహితుడు లాంటి ఎన్నో సినిమాలు అందించారు.

ఇలా ఒక్క నిర్మాణ రంగం లోనే కాదు .. అవుట్ డోర్ యూనిట్ , పోస్ట్ ప్రొడక్షన్ సర్వీసెస్ , ఫిలిం డిస్ట్రిబ్యూషన్ రంగాలలో 40 ఏళ్ళ నుండి ఎన్నో వేల సినిమాలకు తమ జెమినీ స్టూడియో మరియు ఇతర అనుబంధ సంస్థల ద్వారా సేవలందించిన ..శ్రీ మనోహర్ ప్రసాద్ , శ్రీ రవిశంకర్ ప్రసాద్ గార్లు శ్రీ అక్కినేని ఆనందబాబు గారి పిల్లలు గా లెజెండరీ ఎల్.వి ప్రసాద్ గారి వారసులుగా ఎంత ఎదిగినా ఒదిగి ఉంటూ ..ఎన్ని విజయాలను అందుకున్నా అది తమ సమిష్టి విజయం..తమ సంస్థ జెమినీ స్టూడియోస్ విజయం గానే భావిస్తారు ..

మరి ఇప్పుడు జెమినీ స్టూడియోస్ డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ ని పురస్కరించుకుని జెమినీ ఇండస్ట్రీస్ వారి తరుపున జెమినీ సంస్థల మరో ప్రత్యేక ప్రకటనను వెల్లడించారు. అదే “జెమినీ రికార్స్” జెమినీ స్టూడియోస్ లోగో లో ఉన్న పిల్లలు ఊదే కొమ్ము బూర ద్వారా సినిమా కి అన్నింటి తో పాటు పాటకి సంగీతం కి ఉన్న ప్రాదాన్యత మనకు అర్థం అవుతుంది .. అది “జెమినీ రికార్డ్స్” తో మరింత నిజం కాబోతుంది ..ఈ రోజుల్లో ప్రొడ్యూసర్ లకు సినిమా తీయడం కన్నా ఆ సినిమా ని పబ్లిక్ కి రీచ్ చేయడం చాలా కష్టం గా ఉంది .. దాని బిజినెస్ కష్టం గా ఉంది ..

సినిమా హిట్ అవ్వాలంటే ముందు దాని ప్రివ్యూ టాక్ , ప్రిమియర్ టాక్ కాదు దాని ఆడియో టాక్ కావాలి .. ఆ ఆడియో కి హిట్ టాక్ రావాలి .. ఒకసారి పాటలకు హిట్ టాక్ వస్తే ఒక ప్రొడ్యూసర్ గా , ఒక డైరెక్టర్ గా , ఒక మ్యూజిక్ డైరెక్టర్ గా మ, ఒక సింగర్ గా మీరు సక్సెస్ అయ్యినట్టే ..ఆ సక్సెస్ ని మీకు అందించడానికే జెమినీ రికార్డ్స్ అనే కొత్త ఆడియో కంపెనీ ని లాంచ్ చేయబోతుంది ..ఇది సినిమా వాళ్ళకే కాదు, మ్యుజీషియన్స్ కి గాయకులకు ఇది సరి కొత్త వేదిక. సినిమా ప్రపంచానికి..ప్రేక్షకలోకానికి సరికొత్త వారధి..ఇది ఓ సంగీత ప్రపంచం.

సంబంధిత సమాచారం :