జెమిని దసరా క్యాష్ ప్రైజ్ కాంటెస్ట్.. సిద్దంగా ఉండండి..!

Published on Oct 3, 2021 2:33 am IST


సాధారణంగా దసరాకు, దీపావళికి స్పెషల్ ఆఫర్లు, క్యాష్ ప్రైజ్ కాంటెస్ట్‌లు ఉంటాయనేది మనకు తెలిసిందే. అయితే ప్రముఖ టెలివిజన్ ఛానల్ జెమిని కూడా ఈ సారి దసరా క్యాష్ ప్రైజ్ కాంటెస్ట్‌ని నిర్వహిస్తుంది. వేలల్లో విజేతలు, లక్షల్లో నగదు బహుమతులు, మీ కోసం ఓ అద్భుత అవకాశం అంటూ ప్రతి రోజు 300 మంది విజేతలు, 6 లక్షల రూపాయల నగదు బహుమతులను ఇస్తున్నట్టు చెప్పుకొచ్చింది.

అయితే దీనికి మీరు ఏం చేయాలంటే అక్టోబర్ 4వ తేది నుంచి 16వ తేది మధ్య సోమవారం నుండి శనివారం వరకు ప్రతి రోజు సాయంత్రం 6:30 నిమిషాల నుండి, రాత్రి 8:30 నిమిషాల వరకు జెమిని సీరియల్స్ చూడాలి. అంతేకాదు ప్రతి రోజు వారు అడిగే ప్రశ్నలకు సమాధానాన్ని ఒక సింపుల్ మిస్డ్ కాల్ ద్వారా తెలియచేస్తే సరిపోతుంది. సరైన సమాధానాలు చెబితే లక్షల్లో నగదు బహుమతులను గెలుచుకునే అవకాశం ఉందండోయ్. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ క్యాష్ ప్రైజ్ కాంటెస్ట్ కి సిద్దమైపోండి.

సంబంధిత సమాచారం :