గెట్ రెడీ..”మహేష్ 28″ నుంచి బ్లాస్టింగ్ సర్ప్రైజ్ రాబోతుంది.!

గెట్ రెడీ..”మహేష్ 28″ నుంచి బ్లాస్టింగ్ సర్ప్రైజ్ రాబోతుంది.!

Published on Aug 18, 2022 12:10 PM IST

Mahesh Babu
మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన లేటెస్ట్ సాలిడ్ బ్లాక్ బస్టర్ “సర్కారు వారి పాట” చిత్రం కోసం అందరికీ తెలిసిందే. అయితే ఇక ఈ నెక్స్ట్ అయితే దర్శకుడు త్రివిక్రమ్ తో మహేష్ కెరీర్ లో బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామాని ప్లాన్ చేశారు. వీరి కాంబో నుంచి వస్తున్న మూడో సినిమా ఇది కావడంతో తారా స్థాయి అంచనాలు ఈ సినిమాపై నెలకొన్నాయి.

ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఇప్పుడు ఈ సినిమాపై యంగ్ ప్రొడ్యూసర్ నాగవంశీ క్రేజీ అప్డేట్ ని అయితే అందించారు. ఈ చిత్రం నుంచి అంతా సినిమా అప్డేట్ కోసం ఎంతలా ఎదురు చూస్తున్నారో మాకు తెలుసు.. ఇప్పుడు కొంచెం రిలాక్స్ అవ్వండి ఈరోజు సాయంత్రమే ఒక ఎగ్జైటింగ్ అప్డేట్ రాబోతుంది అని బ్లాస్టింగ్ అనౌన్సమెంట్ ఇచ్చారు. దీనితో ఈ క్రేజీ పోస్ట్ మంచి ఆసక్తిగా మారింది. మరి ఈ అప్డేట్ ఏంటో అనేది చూడాల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు