గెట్ రెడీ.. భీమ్లా నాయక్ నుంచి పవర్ ఫుల్ అప్డేట్.!

Published on Aug 13, 2021 1:50 pm IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ ఇంట్రెస్టిన్గ్ ప్రాజెక్ట్స్ లో క్రేజీ మల్టీ స్టారర్ చిత్రం “అయ్యప్పణం కోషియం” రీమేక్ కూడా ఒకటి. దర్శకుడు సాగర్ చంద్ర తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రానా దగ్గుబాటి కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు. మరి ఈ క్రేజీ మాస్ ఎంటర్టైనర్ నుంచి ఈ మధ్య కాలంలో సాలిడ్ అప్డేట్స్ ని కూడా మేకర్స్ ఇస్తూ వస్తుండగా పవన్ అభిమానులు ఈ సినిమా ఫస్ట్ సింగిల్ మరియు ఫస్ట్ లుక్ కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అయితే పవన్ భీమ్లా నాయక్ అనే పవర్ ఫుల్ రోల్ చేస్తున్న ఈ చిత్రం నుంచి ఈరోజు సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు మరో పవర్ ఫుల్ అప్డేట్ ని వదలనున్నట్టుగా మేకర్స్ అలెర్ట్ చేస్తున్నారు. మరి ఆ అప్డేట్ ఏంటి అన్నది మరింత ఆసక్తికరంగా ఇప్పుడు మారింది. మరి ఈ చిత్రం కి త్రివిక్రమ్ కూడా కీలక సేవలు అందిస్తుండగా థమన్ ఎలెక్ట్రీఫయింగ్ మ్యూజిక్ అందిస్తున్నాడు అలాగే సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :