గెట్ రెడీ..ప్రభాస్ వరల్డ్ ప్రాజెక్ట్ నుంచి ట్రీట్.!

గెట్ రెడీ..ప్రభాస్ వరల్డ్ ప్రాజెక్ట్ నుంచి ట్రీట్.!

Published on Oct 22, 2022 12:00 PM IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ భారీ చిత్రాల్లో ప్రపంచ స్థాయి బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ “ప్రాజెక్ట్ కే” కూడా ఒకటి. అయితే ఈ చిత్రం షూటింగ్ ఆల్రెడీ ఆల్ మోస్ట్ సగానికి పైగా కంప్లీట్ కాగా దీనిపై అయితే ప్రభాస్ అభిమానులు అనేక అంచనాలు పెట్టుకున్నారు. డెఫినెట్ గా ప్రభాస్ అయితే పాన్ వరల్డ్ స్థాయిలో ఇండియన్ సినిమాని వేరే స్థాయిలో నిలబెడతాడని గట్టి నమ్మకంతో అయితే ఉన్నారు.

మరి ఇదిలా ఉండగా రేపు ప్రభాస్ బర్త్ డే సందర్భంగా అభిమానులు అప్డేట్స్ కోసం ఎదురు చూస్తున్నారు. మరి ఈ గ్యాప్ లో ప్రాజెక్ట్ కే దర్శకుడు నాగశ్విన్ అయితే ఇప్పుడు ఓ సర్ప్రైజింగ్ అప్డేట్ ని అందించారు. ఓ ఊహించని చిన్న ట్రీట్ అయితే వస్తుంది అని కన్ఫర్మ్ చేసేసాడు. దీనితో అభిమానుల్లో ఆ అప్డేట్ ఏంటి అని అంతా ఆసక్తిగా మారింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు