లేటెస్ట్..అవైటెడ్ “వలిమై” టీజర్ బ్లాస్ట్ కి ముహూర్తం ఫిక్స్!

Published on Sep 17, 2021 10:11 am IST

ప్రస్తుతం మన సౌత్ ఇండియన్ సినిమా దగ్గర భారీ అంచనాలతో వస్తున్న పలు చిత్రాల్లో థలా అజిత్ కుమార్ హీరోగా నటించిన భారీ యాక్షన్ థ్రిల్లర్ “వలిమై” కూడా ఒకటి. దర్శకుడు హెచ్ వినోద్ తెరకెక్కిస్తున్న ఈ సాలిడ్ డ్రామా షూట్ అంతా కంప్లీట్ చేసుకొని రిలీజ్ కి రెడీ అవుతుంది. మరి అజిత్ కెరీర్ లోనే మోస్ట్ అవైటెడ్ గా ఉన్న ఈ చిత్రం నుంచి టీజర్ బ్లాస్ట్ ని మేకర్స్ రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారని ఇటీవల బజ్ బయటకి వచ్చిన సంగతి తెలిసిందే.

మరి సినీ వర్గాల అంతర్గత సమాచారం ప్రకారం ఈ సినిమా టీజర్ బ్లాస్ట్ వచ్చే వారంలోనే ఉంటుంది అని ఫిక్స్ అయ్యింది. దీనితో ఒక్కసారిగా కోలీవుడ్ వర్గాలు హీటెక్కాయి. అజిత్ సినిమాలకి రెస్పాన్స్ ఆ కల్లోలం ఏ స్థాయిలో ఉంటుందో ఇది వరకే చూసాం ఇక ఈ టీజర్ తో ఎలాంటి రికార్డులు నమోదు అవుతాయో చూడాలి. ఇక ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తుండగా బోనీ కపూర్ నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :