గెట్ రెడీ..”RRR” నుంచి ఏ సమయంలో అయినా క్లారిటీ

Published on Oct 1, 2021 8:00 am IST


మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ల కలయికలో దర్శక ద్గీరుడు రాజమౌళి తెరకెక్కించిన భారీ పాన్ ఇండియన్ మల్టీ స్టారర్ చిత్రం “రౌద్రం రణం రుధిరం”. ఇండియన్ సినిమా దగ్గర బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమా రిలీజ్ డేట్ ఇప్పుడు అంతా ఆసక్తిగా మారింది.

దీనితో పాటుగా ఇతర భారీ సినిమాలు అన్నీ కొత్త రిలీజ్ డేట్స్ తో వాటి సమయాలను ఫిక్స్ చేసుకుంటుండగా ఈ సినిమాపై అప్డేట్ మాత్రం ఇంకా గోప్యంగానే ఉంది. కానీ ఇప్పుడు లేటెస్ట్ టాక్ ప్రకారం ఈ చిత్రంకి కొత్త రిలీజ్ డేట్ ని లాక్ చేసినట్టు తెలుస్తుంది.

అంతే కాకుండా దీనిపై ఓ అధికారిక ప్రకటన కూడా బహుశా ఈరోజే వచ్చే అవకాశం ఉన్నట్టుగా ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. మరి దీని కోసం వేచి చూడాలి. ఇక ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందివ్వగా డీవీవీ దానయ్య భారీ వ్యయంతో నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :