గెట్ రెడీ..తలైవర్ నుంచి బ్లాస్టర్ అప్డేట్స్ కన్ఫర్మ్.!

Published on Sep 9, 2021 12:00 pm IST


కోలీవుడ్ సూపర్ స్టార్ స్టార్ తలైవర్ రజినీకాంత్ హీరోగా స్టార్ దర్శకుడు శివ తెరకెక్కిస్తున్న భారీ చిత్రం “అన్నాత్తే”. ఎప్పుడు నుంచో భారీ అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రం నుంచి రేపు సెప్టెంబర్ 10 వినాయక చవితి కానుకగా ఫస్ట్ లుక్ పోస్టర్ ని మేకర్స్ లాంచ్ చేస్తున్నారని టాక్ బయటకి వచ్చింది. మరి దానిని నిజం చేస్తూ మేకర్స్ అధికారిక అప్డేట్ ఇచ్చేసారు.

రేపు ఒకటి కాదు రెండు బ్లాస్టింగ్ అప్డేట్స్ ని సన్ పిక్చర్స్ వారు ఫిక్స్ చేశారు. ఈ చిత్రం నుంచి రజినీ ఫస్ట్ లుక్ ని మొదట ఉదయం 11 గంటలకి రిలీజ్ చేస్తుండగా ఈ లుక్ తాలూకా అదిరే మోషన్ పోస్టర్ టీజర్ ని సాయంత్రం 6 గంటలకి రిలీజ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. అంతే కాకుండా ఒక ఇంట్రెస్టింగ్ పోస్టర్ ని కూడా ఇందులో చూపించారు. శూలాలు, గడ్డి స్టార్టింగ్ లో ఇండియన్ బ్యాక్ డ్రాప్ కనిపిస్తుండగా..

మధ్యలో వెనక్కి తిరిగి ఉన్న రజినీ ఆ ముందు లైట్స్ లో ఏదో దేశపు భవనాలు చూపిస్తున్నారు. అంటే రెండు బ్యాక్ డ్రాప్ లు ఓకే పోస్టర్ లో డిజైన్ చేశారు. ఇదేదో బానే అనిపిస్తుంది. పైగా ఈ చిత్రాన్ని వచ్చే నవంబర్ 4 న థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నట్టుగా కూడా కన్ఫర్మ్ చేసారు. మరి ఈ మోస్ట్ అవైటెడ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ఎలా ఉండనుందో తెలియాలి అంటే రేపటి వరకు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం :