గెట్ రెడీ – డానియల్ నుంచి సాలిడ్ అప్డేట్ కన్ఫర్మ్.!

Published on Dec 14, 2021 10:00 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు మన టాలీవుడ్ హంక్ రానా దగ్గుబాటి కీలక పాత్రల్లో నటిస్తున్న సాలిడ్ మాస్ డ్రామా “భీమ్లా నాయక్”. సాగర్ కె చంద్ర తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో డానియల్ శేఖర్ గా రానా దగ్గుబాటి ఫుల్ యాటిట్యూడ్ రోల్ లో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఈరోజు రానా బర్త్ డే కానుకగా ఒక క్రేజీ అప్డేట్ ని మేకర్స్ రివీల్ చేస్తారని టాక్ ఉండగా ఇపుడు దానిని వారు కన్ఫర్మ్ చేసారు.

ఒక మాస్ పోస్టర్ తో రానా కి బర్త్ డే విషెష్ చెబుతూ ఈరోజు సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు స్వాగ్ ఆఫ్ డానియల్ ని రిలీజ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. మరి ఈ స్పెషల్ టీజర్ ఎలా ఉంటుందో చూడాలి. దీనితో పాటుగా ఈ పోస్టర్ లో సినిమా రిలీజ్ డేట్ ని జనవరి 12నే ఉన్నట్టుగా మళ్ళీ కన్ఫర్మ్ చేసారు. ఓ పక్క మేకర్స్ అయితే రిలీజ్ డేట్ పట్ల కాన్ఫిడెన్స్ గానే గాసిప్స్ మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. చివరిగా ఏం జరుగుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం :