గెట్ రెడీ..’భీమ్లా’ నుంచి మాస్ డానియల్ రాకకి టైం ఫిక్స్.!

Published on Sep 20, 2021 4:18 pm IST


టాలీవుడ్ నుంచి వస్తున్న పలు క్రేజీ మల్టీ స్టారర్ చిత్రాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు రానా దగ్గుబాటి కాంబోలో వస్తున్న సాలిడ్ మాస్ మసాలా డ్రామా
“భీమ్లా నాయక్” కూడా ఒకటి. భారీ అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రం నుంచి మేకర్స్ ఈ సినిమాలో అత్యంత పవర్ ఫుల్ రోల్ డానియల్ శేఖర్ గా చేస్తున్న రానా అప్డేట్ ని ఇస్తున్నామని కన్ఫర్మ్ చేశారు.

మరి ఇప్పుడు ఈ రోల్ నుంచి రానా సాలిడ్ లుక్ తో పాటుగా దీనికి సంబంధించిన గ్లింప్స్ వీడియో ని ఈరోజు సాయంత్రం 6 గంటల 3 నిమిషాలకు రిలీజ్ చేస్తున్నట్టుగా టైం ఫిక్స్ చేసేసారు. సో ఈ అప్డేట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నవారికి మాత్రం ఒక క్లారిటీ ఇప్పుడు వచ్చినట్టే అని చెప్పాలి. మరి ఈ చిత్రానికి సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే దర్శకుడు త్రివిక్రమ్ ఈ సినిమాకి మాటలు స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఇంకా సితార ఎంటర్టైన్మెంట్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :