నెట్ ఫ్లిక్స్ లో బిగ్గెస్ట్ హిట్ కి సీక్వెల్ అనౌన్స్ అయ్యింది.!

Published on Sep 26, 2021 8:14 am IST

ప్రపంచంలో అతిపెద్ద స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ ఏదన్నా ఉంది అంటే అది నెట్ ఫ్లిక్స్ అనే చెప్పాలి. ఇందులో ఉండే క్వాలిటీ వెబ్ కంటెంట్ ఇంకెక్కడా కూడా దొరకదని చెప్పాలి. అందుకే దేనిని బీట్ చేసేందుకు ఇతర సంస్థలు చాలా పోటీ పడతాయి. మరి ఇదిలా ఉండగా ఈ స్ట్రీమింగ్ యాప్ లో భయారే హిట్ అయినటువంటి అది కూడా వరల్డ్ వైడ్ గా చేసిన వాటిలో డైరెక్ట్ సినిమా “ఎక్స్ ట్రాక్షన్” కూడా ఒకటి.

హాలీవుడ్ అండ్ ‘అవెంజర్స్’ ఫేమ్ క్రిస్ హెంస్వర్త్ హీరోగా అదే అవెంజర్స్ మేకర్స్ రస్సో బ్రదర్ నిర్మాతలుగా తెరకెక్కించిన ఈ చిత్రం గత ఏడాది నెట్ ఫ్లిక్స్ లో భారీ హిట్ అయ్యింది. యాక్షన్ మూవీ లవర్స్ కి ఒక రేంజ్ లో ట్రీట్ ఇచ్చిన ఈ చిత్రం అప్పుడు కేవలం 28 రోజుల్లోనే 99 మిలియన్ వ్యూస్ అందుకొని రికార్డు కొట్టింది.

అంటే ఏ స్థాయిలో ఈ సినిమా హిట్టయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. మరి ఈ సినిమా ఎండింగ్ లో దీనికి సీక్వెల్ ఉన్నట్టుగా మేకర్స్ హింట్ ఇచ్చారు. కానీ ఇప్పుడు దానిని నెట్ ఫ్లిక్స్ వారు అధికారికంగా అనౌన్స్ చేసేసారు. లేటెస్ట్ టీజర్ తో దీనిని కన్ఫర్మ్ చేశారు. మళ్ళీ ఈ సినిమాలో క్రిస్ బతికినట్టుగా చూపించారు. మరి ఈ సిసలైన యాక్షన్ ఎంటర్టైనర్ ఎప్పుడు వస్తుందో చూడాలి.

టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :