గెట్ రెడీ.. “ఎన్టీఆర్ 30” పై పవర్ఫుల్ మాస్ అప్డేట్ కి టైం ఫిక్స్.!

Published on May 19, 2022 3:25 pm IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ బిగ్గెస్ట్ ఇండియన్ బ్లాక్ బస్టర్ అయినటువంటి “రౌద్రం రణం రుధిరం” తర్వాత తారక్ నటించే సినిమాలపై నెలకొన్న హైప్ కోసం అందరికీ తెలిసిందే. ఎన్టీఆర్ కెరీర్ లో 30వ సినిమాగా దర్శకుడు కొరటాల శివతో ప్లాన్ చేసిన ఈ మాసివ్ ప్రాజెక్ట్ పై రేపు ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఏదన్నా అప్డేట్ వస్తుందా అని ఆసక్తిగా చూస్తుండగా..

మేకర్స్ ఒక మాసివ్ అప్డేట్ ని ఇప్పుడు అందించారు. ఒక పవర్ ఫుల్ ప్రీ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేసి ఒక్క సారిగా హైప్ ని ఎక్కించారు. కత్తి పట్టుకొని ఉన్న ఈ పోస్టర్ తో ఈ భారీ అప్డేట్ ని ఈ రోజు సాయంత్రం 7 గంటల 2 నిమిషాలకి రివీల్ చేస్తున్నట్టు తెలిపారు. మరి ఈ అప్డేట్ ఏంటో చూడ్డానికి తారక్ ఫ్యాన్స్ అయితే సిద్ధంగా ఉన్నారు. ఇక ఈ సినిమాని నందమూరి కళ్యాణ్ రామ్ తో పాటుగా యువసుధ ఆర్ట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :