గెట్ రెడీ..”RRR” నుంచి ఈ సర్ప్రైజ్ ట్రాక్ వచ్చేస్తుంది.!

Published on Apr 15, 2022 11:30 am IST


మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన భారీ సినిమా “రౌద్రం రణం రుధిరం” ఇప్పటికీ మంచి హోల్డ్ లో థియేటర్స్ లో రన్ కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా రిలీజ్ అయ్యాక ఈ సినిమాలోని ఓ సర్ప్రైజింగ్ సాంగ్ కి అపారమైన స్పందన వచ్చింది.

అదే ఈ సినిమా స్టార్టింగ్ లోనే ఉండే మల్లి సాంగ్ “కొమ్మ ఉయ్యాల”. ఇప్పుడు ఈ సాంగ్ ని రిలీజ్ చేస్తున్నట్టుగా చిత్ర యూనిట్ ప్రకటించారు. రేపు ఏప్రిల్ 16న సాయంత్రం 4 గంటలకి ఈ సర్పైజ్ చార్ట్ బస్టర్ ని రిలీజ్ చేస్తున్నట్టు కన్ఫర్మ్ చేశారు. విజువల్ గా మరియు వినడానికి ఎంతో ఇంపైన సాంగ్ ని సంగీత దర్శకుడు కీరవాణి అందించారు. ఇక యూట్యూబ్ లో రిలీజ్ అయ్యాక ఈ సాంగ్ కి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం :