సోషల్ మీడియా లో దంచి కొడుతున్న లైగర్… యూ ట్యూబ్ లో టాప్ ట్రెండ్ లోకి…

సోషల్ మీడియా లో దంచి కొడుతున్న లైగర్… యూ ట్యూబ్ లో టాప్ ట్రెండ్ లోకి…

Published on Dec 31, 2021 6:02 PM IST


విజయ్ దేవరకొండ హీరోగా, అనన్య పాండే హీరోయిన్ గా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం లైగర్. సాలా క్రాస్ బ్రీడ్ ఈ చిత్రానికి ఉప శీర్షిక. ఈ చిత్రం ను పూరి కనెక్ట్స్ మరియు ధర్మ ప్రొడక్షన్స్ పతాకంపై పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్, కరణ్ జోహార్, అపూర్వ మెహతా లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కి సంబంధించిన ప్రచార చిత్రాలు ఇప్పటికే విడుదల అయి ప్రేక్షకులను అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

తాజాగా ఈ చిత్రం నుండి విడుదల అయిన గ్లింప్స్ సోషల్ మీడియా ను షేక్ చేస్తోంది. అంతేకాక యూ ట్యూబ్ లో సైతం భారీ వ్యూస్ తో దూసుకు పోతుంది. ఇప్పటి వరకూ యూ ట్యూబ్ లో 10 మిలియన్ కి పైగా వ్యూస్ రావడం విశేషం. విడుదల అయిన కొద్ది సేపటికే ఈ తరహా వ్యూస్ తో దూకుడు ప్రదర్శించడం తో సినిమా పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతోన్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం ను వచ్చే ఏడాది ఆగస్ట్ 25 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు