‘వలిమై’ ట్రయో మళ్ళీ రెడీ అవుతుందట.!

Published on Sep 30, 2021 9:00 am IST


థలా అజిత్ కుమార్ హీరోగా కోలీవుడ్ టాలెంటెడ్ దర్శకుడు హెచ్ వినోత్ దర్శకత్వంలో తెరకెక్కించిన భారీ యాక్షన్ ఎంటర్టైనెర్ “వలిమై” కోసం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అజిత్ వివేగం తర్వాత మళ్ళీ అంతటి హాలీవుడ్ లెవెల్ విజువల్స్ తో ఈ చిత్రం కూడా కనిపిస్తుంది. మరి ఇదిలా ఉండగా ఈ చిత్రంని తెరకెక్కించిన దర్శకుడు వినోత్ తో అజిత్ మళ్ళీ ఓ సినిమా వెంటనే చెయ్యనున్నాడని టాక్ ఉన్న సంగతి తెలిసిందే.

మరి ఈ ఇద్దరితో పాటు నిర్మాత బోనీ కపూర్ కూడా కలిసి వర్క్ చేయనున్నట్టు లేటెస్ట్ గా కన్ఫర్మ్ చెయ్యడంతో ఈ ముగ్గురి కాంబినేషన్ ముచ్చటగా మూడోసారి సన్నద్ధం అవుతుంది అని క్లారిటీ వచ్చేసింది. రీసెంట్ గానే బోనీ ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేసినట్టుగా టాక్. అయితే మరి ఈ హ్యాట్రిక్ ప్రాజెక్ట్ పై మరింత సమాచారం ఇంకా రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :