యూట్యూబ్‌లో “గని” అంతెంకు అద్భుతమైన రెస్పాన్స్..!

Published on Nov 13, 2021 2:50 am IST


మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా, సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం “గని”. అల్లు అరవింద్ సమర్పణలో రెనైస్సన్స్ పిక్చర్స్ మరియు అల్లు బాబీ కంపెనీలపై సిద్దు ముద్ద మరియు అల్లు బాబీలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 3వ తేదీన విడుదల కాబోతుంది. అయితే ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, వీడియోలు సినిమాపై ఇప్పటికే ఆసక్తిని పెంచేశాయి.

అయితే ఈ సినిమా నుంచి విడుదలైన గని అంతెంకు యూట్యూబ్‌లో అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. ఇప్పటి వరకు ఈ పాట 4 మిలియన్స్‌కి పైగా వ్యూస్‌ని సాధించింది. ఉపేంద్ర, సునీల్ శెట్టి, నవీన్ చంద్ర తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :