ఫస్ట్ పంచ్ తో రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన “గని”

Published on Oct 6, 2021 5:18 pm IST


వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వం లో స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా గా తెరకెక్కుతున్న తాజా చిత్రం గని. ఈ చిత్రం ను రెనైస్సన్స్ పిక్చర్స్ మరియు అల్లు బాబీ కంపనీ పతాకాల పై సిద్దు ముద్ద మరియు అల్లు బాబీ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కి సంబంధించిన ఫస్ట్ పంచ్ ను చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేయడం జరిగింది. ఫస్ట్ పంచ్ పేరిట చిన్న విడియో ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.

థమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో ఫస్ట్ పంచ్ మరింత పవర్ ఫుల్ గా ఉంది. రక్తపు మరకలతో హీరో వరుణ్ బాక్సర్ గా సూపర్ అనేలా ఉన్నారు. ఈ చిత్రం కోసం వరుణ్ ఎంత కష్టపడ్డారు అనేది ఫస్ట్ పంచ్ చూస్తే తెలుస్తుంది. ఈ చిత్రాన్ని డిసెంబర్ 3 వ తేదీన విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఈ ఫస్ట్ పంచ్ తో ప్రకటించడం జరిగింది. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం లో వరుణ్ తేజ్ సరసన హీరోయిన్ గా సాయి మంజ్రేకర్ నటించడం జరిగింది. ఈ చిత్రం లో జగపతి బాబు, ఉపేంద్ర, సునీల్ శెట్టి, నవీన్ చంద్ర లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఫస్ట్ పంచ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :