“గని” నాన్ థియేట్రికల్ రైట్స్‌కి భారీ డీల్?

Published on Mar 31, 2022 12:03 am IST

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా, సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో బాక్సింగ్ నేపధ్యంలో తెరకెక్కిన చిత్రం “గని”. అల్లు అరవింద్ సమర్పణలో రెనైస్సన్స్ పిక్చర్స్ మరియు అల్లు బాబీ కంపెనీలపై సిద్దు ముద్ద మరియు అల్లు బాబీలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 8న విడుదల కాబోతుంది. దీంతో ఏప్రిల్ 2న వైజాగ్‌లో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక కూడా జరగబోతుంది. ఈ వేడుకకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిధిగా రాబోతున్నాడు.

ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించి నాన్ థియేట్రికల్ రైట్స్ కోసం భారీ డీల్ జరిగినట్టు టాక్ నడుస్తుంది. సుమారు రూ.25 కోట్లకు ఈ సినిమా నాన్ థియేట్రికల్ హక్కులు కొనుగోలు అయ్యాయని తెలుస్తుంది. అయితే దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక సమాచారం వెలువడలేదు. ఇకపోతే తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో ఉపేంద్ర, సునీల్ శెట్టి, నవీన్ చంద్రలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు

సంబంధిత సమాచారం :