వరుణ్ తేజ్ “గని” చిత్రం విడుదల వాయిదా!

Published on Dec 10, 2021 10:00 pm IST


వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం గని. ఈ చిత్రం ను రినైస్సన్స్ పిక్చర్స్ మరియు అల్లు బాబీ కంపనీ ల పై సిద్దు ముద్ద మరియు అల్లు బాబీ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వరుణ్ తేజ్ సరసన హీరోయిన్ గా సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తుండగా, జగపతి బాబు, ఉపేంద్ర, సునీల్ శెట్టి, నవీన్ చంద్ర లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ చిత్రం కి సంబంధించిన ప్రచార చిత్రాలు, వీడియో లు, పాటలు విడుదల అయ్యి ప్రేక్షకులను అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రం ఈ నెల 24 వ తేదీన విడుదల కావాల్సి ఉండగా, తాజాగా విడుదల తేదీని మార్చినట్లు ప్రకటించడం జరిగింది. ప్రస్తుతానికి ఈ చిత్రం విడుదల వాయిదా వేయడం జరిగింది అని, సరికొత్త విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తామని తెలిపింది.

సంబంధిత సమాచారం :