కొత్త రిలీజ్ డేట్ కోసం “గని” టీమ్?

Published on Feb 18, 2022 12:00 pm IST


వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వం లో తెరకెక్కుతున్న స్పోర్ట్స్ డ్రామా చిత్రం గని. ఈ చిత్రం లో వరుణ్ తేజ్ బాక్సర్ గా నటిస్తున్నారు. అల్లు బాబీ కంపనీ మరియు రినైస్సన్స్ పిక్చర్స్ పతాకాల పై ఈ చిత్రాన్ని సిద్ధు ముద్ద మరియు అల్లు బాబీ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, వీడియో లు, పాటలకి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రం పలుమార్లు వాయిదా పడి, ఇప్పుడు ఫిబ్రవరి 25 వ తేదీన వచ్చేందుకు సిద్ధం అవుతున్న తరుణంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుపాటి ల భీమ్లా నాయక్ రిలీజ్ కన్ఫర్మ్ అవ్వడం తో అసలు టెన్షన్ మొదలైంది. ఈ చిత్ర యూనిట్ ఇప్పుడు రిలీజ్ డేట్ ను మార్పు చేసే అవకాశం ఉంది. మార్చ్ 4 వ తేదీన లేదా ఏప్రిల్ నెలలో ఈ చిత్రాన్ని విడుదల చేసే ఆలోచన లో ఉన్నట్లు తెలుస్తోంది. మరి చిత్ర యూనిట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :