వరుణ్ తేజ్ “గని” నుండి థర్డ్ సింగిల్ పై లేటెస్ట్ అప్డేట్!

Published on Feb 3, 2022 9:30 pm IST

వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వం లో తెరకెక్కుతున్న స్పోర్ట్స్ డ్రామా చిత్రం గని. ఈ చిత్రం లో వరుణ్ తేజ్ బాక్సర్ గా నటిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణ లో అల్లు బాబీ కంపనీ మరియు రినైస్సన్స్ పిక్చర్స్ పతాకాల పై ఈ చిత్రాన్ని సిద్ధు ముద్ద మరియు అల్లు బాబీ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, వీడియో లు, పాటలు ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

తాజాగా ఈ చిత్రం నుండి మూడవ లిరికల్ వీడియో పై చిత్ర యూనిట్ తాజాగా ఒక అప్డేట్ ను ఇవ్వడం జరిగింది. థర్డ్ సింగిల్ అప్డేట్ ను రేపు ఉదయం 11:08 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ ప్రకటన తో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబంధిత సమాచారం :