వరల్డ్ డిజిటల్ ప్రీమియర్ గా గని..డేట్ ఫిక్స్!

Published on Apr 17, 2022 12:40 pm IST


మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన గని చిత్రం ఏప్రిల్ 8, 2022 న థియేటర్లలో విడుదలైంది. బాక్సింగ్ నేపథ్యం లో స్పోర్ట్స్ డ్రామా గా వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది మరియు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు తాజా వార్త ఏంటంటే, ఈ చిత్రం డిజిటల్ ప్రీమియర్ గా ప్రేక్షకుల ను అలరించడానికి సిద్ధం అవుతోంది.

గని చిత్రం ఏప్రిల్ 22, 2022 న OTT ప్లాట్‌ఫారమ్ అయిన ఆహాలో ప్రసారం కానుంది. థియేటర్‌లలో సినిమాను మిస్ అయిన వారు ఆహాలో చూడవచ్చు. అల్లు బాబీ మరియు సిద్ధు ముద్ద నిర్మించిన ఈ చిత్రంలో సాయి మంజ్రేకర్, ఉపేంద్ర, సునీల్ శెట్టి, నదియా, నవీన్ చంద్ర మరియు జగపతి బాబు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి థమన్ ఎస్ సంగీతం అందించగా, కిరణ్ కొర్రపాటి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

సంబంధిత సమాచారం :